
ప్రజారోగ్యం పట్టని కూటమి ప్రభుత్వం
బుట్టాయగూడెం: ప్రజారోగ్య రంగాన్ని చంద్రబా బు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు విమర్శించారు. మండలంలోని దొరమామిడిలో ఆదివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కోటి సంతకాల సేకరణ చేశారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ వైద్య రంగాన్ని సువర్ణ అధ్యాయంగా మారిస్తే చంద్రబాబు నీరుగారుస్తున్నారన్నారు. వైఎస్ జగన్ 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా.. చంద్రబాబు ప్రభుత్వం వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయా లని కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ చేస్తే వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని దెబ్బతీశారని, సుమారు రూ.3,800 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో పేదలకు ఉచి త వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటం చేస్తుందని బాల రాజు హెచ్చరించారు. పార్టీ సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, పోలిన సుబ్రహ్మణ్యం, సర్పంచ్ తెల్లం రాముడు, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, నాయకులు కాలింగి వెంకటేశ్వరరావు, చింతలపూడి వెంకట నా రాయణ తదితరులు పాల్గొన్నారు.