
అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు
ఆగిరిపల్లి: మండలంలోని ఈదులగూడెంలో అనుమతి లేకుండా గత పది రోజుల నుంచి తమ పొలంలోని గ్రావెల్‌ను గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు యథేచ్ఛగా తవ్వేస్తున్నాడని రైతులు కుప్పాల శేషగిరి, ముల్లంగి జోజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులు నుంచి తమ పక్కనే ఉన్న పొలంలో ప్రభుత్వం అనుమతిలేకుండా టీడీపీ నేత గ్రావెల్, మట్టిని తవ్వి లారీలలో బయటకు తరలిస్తున్నాడు. ఆ రైతు పొలానికి పక్కనే ఉన్న తమ పొలంలో కూడా పది రోజుల నుంచి దాదాపు పది అడుగుల లోతు తవ్వి మట్టిని లారీలలో తరలిస్తున్నాడని తెలిపారు. ఇదేంటని బాధితులు ప్రశ్నించగా బెదిరింపులు పాల్పడుతున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్‌ఏ, అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు