
●దేశ రక్షణలో నేను సైతం..
దేశ సరిహద్దు భద్రతా దళం సభ్యురాలిగా శిక్షణ పూర్తి చేసుకుని స్వగ్రామానికి వచ్చిన కంటుబోతు రమ్యకు దెందులూరు మండలం ఉండ్రాజవరం గ్రామస్తులు శనివారం ఘనస్వాగతం పలికారు. కంటుబోతు నాగు, పద్మల కుమార్తె రమ్య బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసింది. దేశభక్తితో ఎప్పటికై నా సెక్యూరిటీ ఫోర్స్‌లో చేరాలని నిర్ణయించుకుంది. తన కలను సాకారం చేసుకుంటూ 2022లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకుంది. 2023లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు ఎంపికై సంవత్సరం పాటు శిక్షణ తీసుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్న రమ్య శనివారం ఉండ్రాజవరం గ్రామానికి రావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. రమ్య తల్లిదండ్రులను సైతం గ్రామస్తులు అభినందించారు.
– దెందులూరు