
జోరు వాన.. నరకయాతన
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం వర్షం దంచికొట్టింది. తెల్లవారు జాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో కూలీలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎనిమిది గంటలైనా వాన తగ్గకపోవడంతో ఇక చేసేది రెయిన్‌కోట్లు, గొడుగుల సాయంతో తమ తమ విధులకు వెళ్లారు. అయితే భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా రోడ్లు అధ్వానంగా ఉండడంతో గుంతలు తెలియక వాహనచోదకులు అవస్థలు పడ్డారు. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై మోకాలు లోతు నీరు చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – సాక్షి, నెట్‌వర్క్