
గోడను ఢీకొనడంతో వ్యక్తి మృతి
నూజివీడు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి గోడను ఢీకొన్న సంఘటనలో మండలంలోని తుక్కులూరుకు చెందిన బత్తుల రామ్మోహన్‌రావు(50) అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం నూజివీడు మండలం మీర్జాపురం శివారు కండ్రికలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల రామ్మోహన్‌రావు తక్కులూరులోని తన ఇంటి వద్ద నుంచి హనుమాన్‌జంక్షన్‌లోని బంధువుల ఇంటికి వెళ్తూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీర్జాపురం శివారు కండ్రిక వద్దకు వచ్చే సరికి వాహనం అదుపు తప్పి గోడను ఢీకొట్టాడు. దీంతో అతను బండిపై నుంచి ఎగిరి కింద పడటంతో తలకు బలమైన గాయమై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.