
కుల ఘర్షణలు రెచ్చగొడితే కఠిన చర్యలు
ఏలూరు టౌన్: కై కలూరులో గణేష్ నిమజ్జనం ఊరేగింపులో చోటుచేసుకున్న ఘర్షణలో బాధితులకు న్యాయం చేయటంతోపాటు నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడతామనీ, కై కలూరు దా నిగూడెంలో బాధితులకు పరామర్శ పేరుతో కుల ఘర్షణలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే చర్యలు తప్ప వని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ హెచ్చరించారు. ఏలూరు సబ్ డివిజన్ కార్యాలయంలో ఆది వారం కై కలూరు టౌన్ సీఐ కృష్ణ, కై కలూరు రూ రల్ సీఐ రవికుమార్‌తో కలిసి విలేకరులతో మా ట్లాడారు. ఈనెల 5న సాయంత్రం కై కలూరు కాపులబజార్‌లో గణేష్ నిమజ్జనం ఊరేగింపు జరుగుతుండగా.. దానిగూడెంకు చెందిన పయ్యేద్దు అజయ్‌కుమార్ మరో ఇద్దరితో కలిసి రేషన్ బియ్యం తీసుకునేందుకు మోటారు సైకిల్‌పై వెళుతున్నాడు. బైక్ హారన్ కొట్టడంతో కాపులబజార్‌కు చెందిన కొందరు యువకులతో రెండు వర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. తులసీ శివ, తో ట కార్తికేయ, తులసీ పూర్ణ, పోతుల నాగమణికంఠ అలియాస్ బాలు, పిచ్చుకల రాజేష్, తోట సంజయ్ భార్గవ్ అలియాస్ బబ్లు, కటికల జయప్రకాష్ అనే వ్యక్తులు అజయ్‌పై దాడి చేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన అజయ్ తల్లి, అక్కపై, దినేష్ అనే మరో యువకుడిపై వీరంతా కలిసి దాడి చేసి నట్టు విచారణలో గుర్తించాం. దాడి పక్కా పథకం మేరకు జరిగినట్టు విచారణలో వెల్లడైంది. దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామనీ, కేసు నమోదు చేసి అరెస్ట్ చే శామని డీఎస్పీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టామన్నారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణంగా కనిపిస్తున్నాయని, మరింత లోతుగా విచారణ చేపడతామన్నారు.
జిల్లాలో 30 యాక్ట్
ఏలూరు జిల్లాలో యాక్ట్ 30తోపాటు 144 సెక్షన్ అమల్లో ఉందనీ, కై కలూరు పట్టణం, దానిగూడెంకు బయటి వ్యక్తులు పరామర్శల పేరుతో వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాలని డీఎస్పీ తెలిపా రు. కులఘర్షణలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. కై కలూరు కాపులబ జార్, దానగూడెంలో భారీ పోలీస్ బందోబస్తు ఏ ర్పాటు చేశామనీ, రెండు వర్గాలకు పూర్తిగా రక్షణ క ల్పించేలా జిల్లా ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు చ ర్యలు తీసుకున్నామని చెప్పారు. సుమారు 150 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.