
ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి
తాడేపల్లిగూడెం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అప్సడా మాజీ వైస్‌చైర్మన్, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాంను శనివారం నియమించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో తెలిపింది. గత ప్రభుత్వంలో అప్సడా వైస్‌చైర్మన్‌గా నిరంతరం రైతుల వెంట ఉన్న వడ్డి రఘురాం ఈ రంగానికి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆక్వా రంగంలో విశేష సేవలందించడానికి వీలుగా తనకు ఈ పదవిని ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి రఘురాం ధన్యవాదాలు తెలిపారు. ఆయన నమ్మకానికి తగ్గట్టుగా రైతులకు సేవలు అందిస్తానన్నారు.