
టేబుల్ టెన్నిస్‌లో విద్యార్థి ప్రతిభ
ఆగిరిపల్లి : రాష్ట్ర స్థాయిలో జరిగిన టేబు ల్ టెన్నిస్ పోటీల్లో ఆగిరిపల్లి మండల విద్యార్థి కాంస్య పతకం సాధించాడు. చొప్పరమెట్లలోని కేకేఆర్ హ్యాపీ వ్యాలీ పాఠశాల విద్యార్థి గోపాలకృష్ణ అండర్ 19 సింగిల్ విభాగంలో పాల్గొని ప్రతిభ చాటాడు. ఈ విజయం ద్వారా సీబీఎస్‌ఈ నేషనల్ లెవెల్ టేబుల్ టెన్నిస్ పోటీలకు అర్హత సాధించాడు. విద్యాసంస్థల చైర్మన్ కొసరాజు కోటేశ్వరరావు, సిబ్బంది విద్యార్థిని అభినందించారు.
వరకట్నం వేధింపులపై కేసు నమోదు
భీమవరం: అదనపు కట్నం కోసం వేదిస్తున్నారంటూ భీమవరం పట్టణానికి చెందిన గోడి అనిత శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం అనితకు రాజమహేంద్రవరం మండలం మారంపూడికి చెందిన కోడి జాషువాజైకుమార్‌తో సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. కొంతకాలం తరువాత భర్త కోడి జాషువాజైకుమార్ అతని కుటుంబ సభ్యులు రూ.10 లక్షలు అదనపు కట్నం తీసుకొని రావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ మేరకు అనిత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ చెప్పారు.
బావిలో పడిన ఎద్దు
కై కలూరు: ప్రమాదవశాస్తూ బావిలో పడిన ఎద్దును స్థానిక అగ్రిమాపక సిబ్బంది చాకచక్యంగా రక్షించిన ఘటన కై కలూరు రైతు బజారు ఎదురుగా శుక్రవారం జరిగింది. ఉదయం ఓ బలమైన ఎద్దు పాడుబడిన నూతిలో పడింది. భారీ శబ్ధం రావడంతో ఓ వ్యక్తి గమనించి సమీపంలోని ఫైర్ ఆఫీస్‌లో సమాచారం అందించారు. హుటాహుటీన వచ్చిన సిబ్బంది శ్రీనివాసరావు, రాజేష్‌బాబు, రవీంద్రబాబు మరో కొందరి స్థానికుల సాయంతో తాళ్లు కట్టి ఎద్దును రక్షించారు. ఇదే నూతిలో కొద్ది రోజుల క్రితం దూడ పడితే రక్షించామని స్థానికులు చెప్పారు. బావిపై మూత ఏర్పాటు చేయాలని యజమానికి సూచించారు.
ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు
కై కలూరు: క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటానని బంధువులకు సెల్ ఫోన్ మెసేజ్ పెట్టిన యువకుడిని కై కలూరు టౌన్ ఎస్సై ఆర్.శ్రీనివాస్ చాకచక్యంగా శుక్రవారం పట్టుకుని తండ్రికి అప్పిగించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఏలూరు జిల్లా తడికలపూడి గ్రామానికి చెందిన అందుగుల థామస్(20) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 4న కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏలూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ దేవాలయం వరకు కారుకు ఆప్టింగ్ డ్రైవర్‌గా వెళ్ళాడు. అక్కడ నుంచి సమీప సోదరుడు రత్నారావుకు తాను ఇటీవల జరిగిన గొడవకు మనస్థాపం చెందానని తనువు చాలిస్తోన్నానని మెసేజ్ పెట్టాడు. దీంతో వెంకటరత్నం టోల్‌ఫ్రీ నంబర్ 112కు పోన్ చేసి పోలీసులకు వివరాలు చెప్పాడు. సెల్ సిగ్నిల్ ఆధారంగా ఆకివీడు నుంచి కై కలూరు మీదుగా ఏలూరు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కిన థామస్‌ను కై కలూరులో టౌన్ ఎస్సై శ్రీనివాస్ గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. యువకుడి తండ్రి లక్ష్మణరావును పిలిపించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం యువకుడిని గుర్తించడంలో చొరవ చూపిన హెడ్‌కానిస్టేబుల్ నాగరాజును అభినందించారు.

టేబుల్ టెన్నిస్‌లో విద్యార్థి ప్రతిభ