
ఎఫెక్ట్
జాతీయ రహదారి మరమ్మతులు ప్రారంభం
కొయ్యలగూడెం: స్థానిక జాతీయ ప్రధాన రహదారి అభివృద్ధికి నేషనల్ హైవే అధికారులు శుక్రవారం పనులను ప్రారంభించారు. జూలై 26న సాక్షిలో ‘అధ్వాన రహదారులతో ఇక్కట్లు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు ఇటీవల చెక్ పోస్ట్ సెంటర్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వరకు ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మార్జిన్‌ను పరిశీలించారు. అనంతరం పొక్లెయిన్‌తో రహదారిపై ఏర్పడిన మార్జిన్‌ను క్రమబద్ధీకరించే పనులను ప్రారంభించారు. రెండు రోజులలో పనులను పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అప్పటివరకు డివైడర్‌కి ఒక పక్కనే రాకపోకలను సాగించడానికి ప్రయాణికులు సహకరించాలని కోరారు.
పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు చర్యలు
తాడేపల్లిగూడెం రూరల్: భారీ వర్షాలు కురిస్తే రహదారులపై నీళ్లు నిలిచిపోతుండటం, పారిశుద్ధ్యం లోపిస్తుండటంపై ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. మండలంలోని మోదుగ గుంట, ఉప్పరగూడెం గ్రామాల్లో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని మోటార్లు ఏర్పాటు చేసి, బయటకు పంపించే ఏర్పాటు చేశారు. ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ఎం.వెంకటేష్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం రహదారులపై బ్లీచింగ్, ముగ్గు చల్లించారు.

ఎఫెక్ట్

ఎఫెక్ట్