
●రాఖీ.. సందడి
సోదర, సోదరీమణుల ఆప్యాయతానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి శనివారం కావడంతో తాడేపల్లిగూడెం పట్టణ, రూరల్ మండలంలో రాఖీల కొనుగోలులో యువతులు నిమగ్నమయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారికిరువైపులా ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు యువతులు, మహిళలు చేరుకుని రాఖీలను కొనుగోలు చేశారు. రూ.20 నుంచి రూ.280 వరకు విలువైన రాఖీలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. అయితే స్టాల్స్ విరివిగా పెరగడంతో కొనుగోళ్ళు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు పేర్కొన్నారు.
– తాడేపల్లిగూడెం రూరల్