
నేత్రపర్వం.. పవిత్రాదివాసం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నార. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పవిత్రాదివాసాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం విశ్వక్సేనపూజ, పుణ్యహవాచనం, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలను అర్చకులు, రుత్వికులు అట్టహాసంగా చేశారు. అనంతరం పవిత్రాలకు పంచగవ్య ప్రోక్షణ, అభిమంత్రణలను నిర్వహించారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల వద్ద పవిత్రాలను ఉంచి పంచ శయనాదివాసాన్ని వేద మంత్రోచ్ఛరణతో అర్చక స్వాములు నిర్వహించారు. ఆ తర్వాత మహాశాంతి హోమాలు, చతుర్వేద పారాయణ చేశారు.

నేత్రపర్వం.. పవిత్రాదివాసం