
వరలక్ష్మీ వ్రతం పేరిట ధరల దోపిడీ
భీమవరం(ప్రకాశం చౌక్): వరలక్ష్మీ వ్రతం అంటేనే ఏడాదిలో తొలి పండగా భావించి ఏంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. భక్తుల సెంటిమెంట్‌ను ఆసరాగా తీసుకొని పూజకు అవసరమైనన పండ్లు, పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయల ధరలను పెంచి వ్యాపారస్తులు దోపిడీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పూజా సామగ్రి ధరలు గురువారం మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో డజను అరటి పండ్లు రూ.50 నుంచి రూ.60 ఉంటే రూ.100 రూపాయలకు విక్రయించారు. లక్ష్మీదేవి అమ్మవారికి పూజకు ఎక్కువగా చామంతి పూలు వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో చామంతి పూల రేటు పెంచి కేజీ చామంతులు రూ.600 వరకు విక్రయించారు. కనకాంబరాలను కూడా మర రూ.150 నుంచి రూ.200, మల్లెపూలు రూ.100 నుంచి రూ.150 వరకు అమ్మకాలు చేశారు. తమలపాకులు మోద రూ.50 నుంచి 70 రూపాయలు, కొబ్బరి కాయలు చిన్నవి రూ.30, పెద్దవి రూ.40 రూపాయలు చొప్పున అమ్మకాలు చేశారు. వరలక్ష్మీ వ్రతం పండుగ పేరట ధరల బాగా పెంచడంతో సామాన్యుల వరలక్ష్మీ పూజ ఖర్చుకు ఇబ్బందులు పడ్డారు.