
రాజ్యాంగానికి రఘురామ వరకభాష్యం
ఏపీ బహుజన జేఏసీ
ఉండి: రాజ్యాంగం కల్పించిన హక్కులకు వక్రభా ష్యం చెబుతూ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఏపీ బహుజన జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నారు. పాములపర్రులో జరిగిన ఘటనపై వివరణ ఇస్తూ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పాములపర్రు దళితులు, జేఏసీ రాష్ట్ర నాయకులు గురువారం నిరసన తెలిపారు. ఏపీ బహుజన జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ మత స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, దీనిని కాదని క్రైస్తవ మతానికి చెందిన వారు దళితులు కారని ఎమ్మెల్యే ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. రాష్ట్రంలో వివిఽ ద కులాలకు చెందిన వారు క్రీస్తును నమ్ముకున్నారు వారిని క్రైస్తవులుగా మార్చేస్తారా? వారి కులాన్ని కాదంటారా? అంటూ ప్రశ్నించారు. కూటమి నాయకుల తప్పుడు సమాచారంతోనే ఎమ్మెల్యే రఘురామ మాట్లాడుతున్నారన్నారు. గతంలో అధికారులు ఇచ్చిన శ్శశాన భూమి రికార్డులు పరిశీలించడంతో పాటు 150 ఏళ్ల నుంచి ఇక్కడ సమాధులున్నాయని గమనించాలన్నారు. స్థానికంగా వరి చేలు లేవని, ఉన్నవి రొయ్యల చెరువులేనన్నారు. నలుగురు రైతుల సంక్షేమం కోసం వందల మంది మనోభావాలు దెబ్బతినేలా దళితులకు ప్రత్యేకమైన శ్శశాన భూమిని పాడుచేసేలా రోడ్డు నిర్మాణం చేస్తారా అని మండిపడ్డారు. పాములపర్రులో దళితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని చెప్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మాజీ సీఎం జగన్, జాతీయ మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఉండిలో ఓ కూటమి నేత ఇంటికి రాత్రి వేళలో ఓ పోలీస్ అధికారి వెళ్లడం, వారితోపాటు శ్శశానంలో రోడ్డు కావాలంటూ ప్రేరేపించిన కూటమి నాయకులు ఉండటం అనుమానాలకు తావిస్తోందని దళితులు చెబుతున్నారు.