సర్వేలతో కాలయాపన | - | Sakshi
Sakshi News home page

సర్వేలతో కాలయాపన

Jul 24 2025 7:36 AM | Updated on Jul 24 2025 7:36 AM

సర్వే

సర్వేలతో కాలయాపన

నిరుద్యోగ భృతి ఇంకెప్పుడు?

గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025

ఏలూరు (మెట్రో): ఆడబిడ్డ నిధి కోసం ఎదురుచూస్తున్న పేద మహిళల ఆశలపై టీడీపీ ముఖ్య నేత, కీలక మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు నీళ్లు చల్లాయి. ఈ పథకాన్ని అమలు చేస్తే ఆంధ్రాను అమ్మాలన్న సంచలన వ్యాఖ్యలతో ఆడబిడ్డ నిధి అమలు లేనట్టేనని స్పష్టం చేశారు. ఎంత ఖర్చవుతుందో ఎన్నికలప్పుడు తెలియదా అని కూటమి తీరుపై మహిళలు మండిపడుతున్నారు. ఈ పథకం అమలుపై ముందే చేతులెత్తేసిన సర్కారు... మరో రెండు పథకాల విషయంలో సర్వేలతో కాలం వెళ్లదీస్తోంది.

పీ4 పథకం అమలులో మరింత జాప్యం

అట్టడుగు పేదల కోసమంటూ ప్రచారం చేసుకుంటున్న పీ4 అమలుకు చంద్రబాబు సర్కారు ఆపసోపాలు పడుతోంది. సర్కారు పిలుపునకు సంపన్నుల నుంచి స్పందన లేక సర్వేల పేరిట కాలయాపన చేస్తోంది. సర్వే చేసిన వారిలో ఇంకా పేదవారు ఉన్నారనేది గుర్తించాలని మరోమారు ఆదేశించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారిని గుర్తించినప్పటికీ తాజాగా కరెంటు ఉందా, గ్యాస్‌ స్టవ్‌ ఉందా అనే అంశాలను గుర్తించాలని మరోమారు ఆదేశించారు. కడు పేదరికంలో ఉన్నారా లేదా అనే విషయాలు స్పష్టంగా తెలుసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సర్వేలు పూర్తి చేసినా మరోమారు సర్వేలు ఏంటో అర్ధంకాక సచివాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం గ్రామాల్లో ఈ సర్వే వివరాలు గ్రామ సభలు ద్వారా పొందు పరచాలని, అంతే కాకుండా పేద కుటుంబాలను గ్రామాల్లో ఉన్నత కుటుంబాలు దత్తత తీసుకునే ఏర్పాట్లు సైతం చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో సచివాలయ సిబ్బందికి మరోమారు ఈ సర్వే అంశం, దత్తత అంశం కత్తిమీద సాముగా మారబోతున్నాయి.

రీసర్వే పేరిట తాజాగా మార్గదర్శకాలు

గ్యాస్‌ కనెక్షన్‌ లేకుండా ఉండాలి, ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ లేనివారు, ఆదాయం లేని కుటుంబం (ఉద్యోగం, రెంట్‌, ఇంటరెస్ట్‌, పెన్షన్‌ లేనివారు), రక్షిత నీరు అందుబాటులో లేక తెచ్చుకునేందుకు 30 నిమిషాలు సమయం పట్టేవారు. బ్యాంక్‌ ఖాతా లేని కుటుంబం. వీటిలో కనీసం ఒక్కటి వర్తించినా ఆ కుటుంబం అర్హులవుతారు.

అనర్హతలు

5 ఎకరాలకన్నా ఎక్కువ భూమి, లేదా 2 ఎకరాలకన్నా ఎక్కువ మాగాణి భూమి కలిగి ఉండటం. కుటుంబంలో ఎవరికై నా ప్రభుత్వ ఉద్యోగం, పట్టణంలో ఆస్తిపన్ను, కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా, ఫోర్‌ వీలర్‌, 200 యూనిట్లు కన్నా అధిక విద్యుత్‌ వినియోగం. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా అనర్హులవుతారు.

సర్వే నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది

న్యూస్‌రీల్‌

పథకాలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు

మళ్లీ మళ్లీ సర్వేలు చేయలేక సచివాలయ సిబ్బంది అసహనం

పీ4 పథకంపై గ్రామ సభలు, దత్తత అంటూ కాలయాపన

నిరుపేదలను వడపోయాలంటూ ఆదేశాలు

నిరుద్యోగ భృతి సర్వే వివరాలు బుట్టదాఖలు

సర్వే పూర్తయి మూడు నెలలు కావస్తున్నా నేటికీ అర్హులకు ఉద్యోగాల కల్పన కానీ, నిరుద్యోగ భృతి కానీ కల్పించిన పాపాన పోవడం లేదు. కూటమి సర్కారు నిరుద్యోగులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, పని లేకుండా ఉండే ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని లేదంటే నిరుద్యోగ భృతిగా రు.3 వేలు అందించి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని అబద్ధపు వాగ్దానాలు చేసింది. ఇప్పుడు గద్దెనెక్కాక కూటమి ప్రభుత్వం సంవత్సరం కావస్తున్నా ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి అందించిన పాపాన పోలేదు. జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఏ పనీ లేని వారి సంఖ్య 6,37,333 మంది ఉన్నట్లు తేలింది. మూడు నెలలు క్రితం చేసిన ఈ సర్వేలో జనాభా ఎంత.. వివిధ పనులు చేస్తున్న వారు ఎంత మంది, ఏ పనీ చేయని వారు ఎంతమంది, ఇళ్ల వద్ద పనులు చేసేందుకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారనే అంశాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సర్వేను సచివాలయ ఉద్యోగులు పూర్తి చేశారు. సర్వేలో నివాస గృహాల్లో బ్రాడ్‌బాండ్‌, వైఫై సదుపాయం, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉందా లేదా అన్న వివరాలు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా చేసిన సర్వేలో మొత్తం గృహాలు 4,90,034 కాగా.. మొత్తం సర్వే పూర్తి చేసిన వారు 10,82,850 మంది. వివిధ పనులు చేస్తున్న వారు 1,93,819 మంది ఉన్నారు. ఏ పనీ చేయని వారు 6,37,333 మంది ఉన్నారు. ఇంటి వద్ద వివిధ పనులు చేస్తున్న వారు 17,341 మంది ఉన్నారు. ఈ సర్వేలు అనేవి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందించేందుకు సహకారం అందించకుండా సంక్షేమాన్ని ఎగ్గొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలని సామాన్యులు పెదవి విరుస్తున్నారు. ఎంతకాలం సర్వేలతో నెట్టుకొస్తారని నిలదీస్తున్నారు.

సర్వేలతో కాలయాపన 1
1/2

సర్వేలతో కాలయాపన

సర్వేలతో కాలయాపన 2
2/2

సర్వేలతో కాలయాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement