
రీ సర్వేపై సమీక్ష
భార్యను చంపిన భర్త అరెస్టు
చేపల చెరువు అమ్మకానికి భార్య అడ్డుపడుతోందని కక్ష పెంచుకుని హత్య చేసిన భర్తను కలిదిండి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 8లో u
ఏలూరు(మెట్రో): రెవెన్యూ అంశాలు– రీసర్వేలపై రాష్ట్ర భూపరిపాలన శాఖ అదనపు చీఫ్ కమిషనర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి, కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నాటికి నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు సిద్ధం చేయాలని, ఆక్రమణల రెగ్యులేషన్స్, రీ సర్వే తదితర అంశాలపై మండలాలు వారీగా సమీక్షించి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రగతిలో వెనుకబడ్డ మండల అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. మరోసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని ఇదే సంఘటనలు పునరావృతం అయితే సంబంధిత అధికారులను, సిబ్బందిని బాధ్యులను చేసి సస్పెండ్ చేస్తానని ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ–సర్వే కార్యక్రమాన్ని చాలెంజ్‌గా స్వీకరించాలని, రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను పిలిచి పండుగ కార్యక్రమం నిర్వహించాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు మనసు పెట్టి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్, ఆర్డీవో అచ్యుత అంబరీష్ తదితరులు పాల్గొన్నారు.