
గంగానమ్మ.. చల్లగా చూడమ్మా
గంగానమ్మా.. చల్లగా చూడమ్మా.. అంటూ పెద్ద ఎత్తున మహిళా భక్తులు, హిజ్రాలు ఆషాఢం సారెతో గురువారం క్షేత్ర పురవీదుల్లో తిరుగాడారు. ముందుగా వారంతా శ్రీవారి పాదుకా మండపం వద్ద రకరకాల స్వీట్లు, పండ్లు, పూలు, చీరలు, పసుపు, కుంకుమ (సారె)ను ఉంచి పూజలు నిర్వహించారు. ఇందులో దేవస్థానం ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ సతీమణి హిజ్రాలకు పూల మాలలు వేసి, ఆశీర్వచనం పొందారు. అనంతరం మహిళలు, హిజ్రాలు సారెను శిరస్సుపై, భుజాలపై పెట్టుకుని క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. గంగానమ్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి సారె సమర్పించారు.
– ద్వారకాతిరుమల

గంగానమ్మ.. చల్లగా చూడమ్మా

గంగానమ్మ.. చల్లగా చూడమ్మా

గంగానమ్మ.. చల్లగా చూడమ్మా