
మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం
దెందులూరు: మాదక ద్రవ్యాలను వినియోగిస్తే విద్యార్థుల భవిష్యత్తు శూన్యమవుతుందని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఈగల్ టీం ఐజీ రవికృష్ణ అన్నారు. బుధవారం ఏలూరు ఆశ్రమం వైద్యశాలలో ఐజీలు అశోక్ కుమార్, రవికృష్ణ, జిల్లా ఎస్పీ కే.ప్రతాప్ కిషోర్ సమన్వయంతో మాదకద్రవ్యాల వినియోగం అనర్ధాలపై మెగా అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, అసిస్టెంట్ ఎకై ్సజ్ కమిషనర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల అనర్థాలను వివరించారు. ఏలూరు ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని ఆశ్రం హాస్పిటల్‌లో నిర్వహించడం విద్యార్థులకు అవగాహన కలిగించడం మంచి కార్యక్రమమన్నారు. ఈగల్ ఎస్పీ నగేష్ మాట్లాడుతూ ఉన్నత విద్యభ్యసించేవారు ఎక్కువగా మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ రతీదేవి, ఆశ్రం హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాసరావు, సీఈఓ హనుమంతరావు, డీఎస్పీ డీ.శ్రావణ్ కుమార్, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ధనరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.