
ట్రిపుల్ ఐటీల్లోని గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలు పెంచాలి
నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో 2018లో నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలను పెంచాలని ట్రిపుల్ ఐటీ కాంట్రాక్టు టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరుఫున మంగళవారం ఆర్జీయూకేటీ రిజిస్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌కు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో జాయిన్ అయిన గెస్ట్ ఫ్యాకల్టీకి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదన్నారు. రాబోయే రోజుల్లో జరగబోయే గవర్నింగ్ కౌన్సిల్ ఎజండాలో ఈ అంశాన్ని పెట్టి ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీత, భవ్య, రామకృష్ణ, నేతాజీ తదితరులు పాల్గొన్నారు.