రైతు నెత్తిన బీమా పిడుగు | - | Sakshi
Sakshi News home page

రైతు నెత్తిన బీమా పిడుగు

Jul 15 2025 6:25 AM | Updated on Jul 15 2025 6:25 AM

రైతు

రైతు నెత్తిన బీమా పిడుగు

నూజివీడు : రైతులు పంటల బీమాకు దూర మయ్యే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు మంగళం పాడిన సర్కారు.. తాజాగా బీమా ప్రీమియాన్ని పెంచి పెనుభారం మోపింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రీమియాన్ని బాగా పెంచేసింది. గతేడాది ఎకరా వరికి రూ.420 బీమా ప్రీమియం ఉండగా, ఈ ఏడాది రూ.840 చేసింది. ఈ మేరకు పంట నష్టం వాటిల్లితే బీమా పరిహారం కింద రూ.42 వేలు చెల్లించనున్నారు. అలాగే మినుము పంటకు గతేడాది రబీ సీజన్‌లో ఎకరాకు రూ.60 ప్రీమి యం ఉండగా దానిని ఐదు రెట్లు పెంచేసి రూ.300 చేసింది.

గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు రైతులకు ఉచిత పంటల బీమాను అందించారు. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం భరించడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం చెల్లించారు. అలాగే ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.13,500 అందించి వెన్నుదన్నుగా నిలిచారు. కూటమి ప్రభుత్వంలో ప్రీమియం భారం మోపడంతో పాటు పెట్టుబడి సాయానికి తొలి ఏడాది ఎగనామం పెట్టారు. ఇప్పటికే ఖరీఫ్‌ పనులు మొదలుకాగా.. అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయాన్ని అందించలేదు.

కౌలు రైతుల పరిస్థితి దారుణం

ప్రస్తుత ప్రభుత్వంలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. భూ యజమానికి కౌలు చె ల్లించడంతోపాటు సాగు ఖర్చులు కూడా భరించాలి. ఆ మేరకు ధాన్యం ధరలు పెరగకపోవడంతో కౌలు రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీమా ప్రీమియాన్ని రెట్టింపు చేయడంతో వారు బీమా జోలికి వెళ్లే పరిస్థితులు లేవు.

కంపెనీల బాగు కోసమే..

రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూ రెన్స్‌ కంపెనీల బాగు కో సమే పనిచేస్తోంది తప్ప రైతుల ప్రయోజనాల గు రించి ఎప్పుడూ ఆలోచించడం లేదు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తారని అనుకోవడం అవివేకం.

– నిమ్మగడ్డ నరసింహ, ఏపీ రైతు సంఘం నాయకులు, నూజివీడు

ప్రభుత్వమే చెల్లించాలి

పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. భారీగా పెంచడంతో బీమా ప్రీమియాన్ని రైతులు చెల్లించే పరిస్థితులు లేవు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉన్నందున వారిపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– బాణావతు రాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, నూజివీడు

ప్రీమియాన్ని పెంచేసిన కూటమి ప్రభుత్వం

పంటల బీమాకు దూరం కానున్న రైతులు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు

రైతు నెత్తిన బీమా పిడుగు 1
1/2

రైతు నెత్తిన బీమా పిడుగు

రైతు నెత్తిన బీమా పిడుగు 2
2/2

రైతు నెత్తిన బీమా పిడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement