పీజీఆర్‌ఎస్‌కు అర్జీల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు అర్జీల వెల్లువ

Jul 15 2025 6:25 AM | Updated on Jul 15 2025 6:25 AM

పీజీఆర్‌ఎస్‌కు అర్జీల వెల్లువ

పీజీఆర్‌ఎస్‌కు అర్జీల వెల్లువ

ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)కు అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 389 అర్జీలను ప్రజలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాల్లాడుతూ అర్జీలను నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా తగదని అధికారులకు సూచించారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరాజు, జెడ్పీ సీఈఓ శ్రీహరి తదితరులు ఉన్నారు.

అర్జీల్లో కొన్ని..

● పెదవేగి మండలం బాపిరాజుగూడెంకు చెందిన చొదిమెళ్ల సుహాసిని తన పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని వినతిపత్రం అందించారు.

● ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన దొంగ నరసింహ వీరాంజనేయులు రేషన్‌ కార్డులో తొలగించిన తన పేరు తిరిగి నమోదు చేయాలని అర్జీ అందించారు.

● ఏలూరు మండలం కొమడవోలుకు చెందిన బంటుపల్లి చంటమ్మ తనకు ఇంటి నిర్మాణానికి రుణం కావాలని అభ్యర్థించారు.

● ఏలూరులోని హనుమాన్‌నగర్‌కు చెందిన గొల్లపల్లి వెంకటరమణ తమ భూమిని చేపల చెరువుకు లీజుకు ఇవ్వగా లీజు దారుడు లీజు చెల్లించకపోవడంతో పాటు తమ కుటుంబంపై దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

● ముసునూరు మండలం గోపవరానికి చెందిన గురజాల వెంకటేశ్వరరావు తనకు వృద్ధాప్య పింఛన్‌ ఇప్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement