కూటమి మోసాలపై ప్రజల్లోకి.. | - | Sakshi
Sakshi News home page

కూటమి మోసాలపై ప్రజల్లోకి..

Jul 14 2025 4:51 AM | Updated on Jul 14 2025 4:51 AM

కూటమి

కూటమి మోసాలపై ప్రజల్లోకి..

ఏలూరు టౌన్‌ : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని.. అధికారం చేపట్టి ఏడాది గడిచినా సూపర్‌ 6 హామీలు అమలు చేయటంలో ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్‌ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంధ్రనాథ్‌ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఏలూరు పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి నిర్వహించారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ నాయకత్వంలో చేపట్టిన సమావేశానికి ఏలూరులోని పార్టీ నేతలు, శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా పరిశీలకుడు రవీంధ్రనాథ్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తూ 99 శాతం అమలు చేసి, ప్రజలకు సంక్షేమ పాలన అందించారని గుర్తు చేశారు. నేడు కూటమి పాలనలో సూపర్‌ 6 పథకాలతో పాటు మరో 146కి పైగా హామీలు ఏమయ్యాయో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే సూపర్‌ 6 హామీలను అమలు చేస్తామంటూ ప్రజలను నమ్మించి, నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. మనమంతా వైఎస్సార్‌సీపీ కుటుంబమని.. సమష్టిగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని, ప్రజలకు మంచి జరిగేలా చేద్దామని పిలుపునిచ్చారు.

డిప్యూటీ సీఎం ఎక్కడ?: కారుమూరి సునీల్‌

వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ కారుమూరి సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచిత్ర పాలన సాగుతుందని, సీఎం చంద్రబాబు ఇటీవల తల్లికి వందనం పథకం తన కొడుకు లోకేష్‌ ఆలోచనలోంచి వచ్చిందంటూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తామంటూ వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ ఎక్కడ ఉన్నారో తెలియదని, ఆయన మాటలకు కూటమిలో పవర్‌ లేదన్నారు. కేవలం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఎవరో చేసిన పనులను తానే చేసినట్లు చెప్పుకోవటంలో టీడీపీ నేతలు సిద్దహస్తులన్నారు. గతంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అమలు చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు శ్రమించారని గుర్తు చేశారు.

ప్రజలకు వెన్నపోటు: విజయరాజు

చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ.. టీడీపీ కూటమి పాలనలో చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఆయన చేసిన మోసాన్ని ప్రజలకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. డైవర్షన్‌, రెడ్‌బుక్‌ పాలిటిక్స్‌ మాత్రమే ఉన్నాయని, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం కూటమికి లేదన్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీ అన్నారని, ఏడాది గడిపేశారని పోస్టుల భర్తీ ఎప్పటి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు.

పేదలకు భరోసా జగన్‌: మామిళ్లపల్లి

ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ మాట్లాడుతూ.. నాడు కూటమి నేతలకు రాష్ట్ర బడ్జెట్‌ గురించి తెలియకుండానే హామీలు ఇవ్వడం ప్రజలను మోసం చేసేందుకేనా అంటూ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు. నవరత్నాల పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, ఆయన హయంలో పేద కుటుంబాలకు భరోసా కల్పించారని చెప్పారు. సమావేశానికి ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఎంఆర్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, కార్పొరేటర్లు తుమరాడ స్రవంతి, కిలాడి జ్యోతి, ఇనపనూరి కేదారేశ్వరి, తంగెళ్ళ రాము, ఇమ్మానుయేల్‌ జయకర్‌, నిర్మలజ్యోతి, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు పల్లి శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకపల్లి గణేష్‌, గేదెల సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

సూపర్‌ 6 హామీల అమలుకు ఉద్యమం

ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో వక్తలు

కూటమి మోసాలపై ప్రజల్లోకి.. 1
1/1

కూటమి మోసాలపై ప్రజల్లోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement