
వైద్యుడు లేకపోవడంపై గ్రామస్తుల నిలదీత
ద్వారకాతిరుమల: మండలంలోని వేంపాడులో 104 వైద్య సిబ్బందిని గ్రామస్తులు శనివారం నిలదీశా రు. వైద్యుడు లేకుండా సేవలు ఎలా అందిస్తారని మండిపడ్డారు. గ్రామంలో ప్రజలకు ప్రతినెలా 104 సేవలను అందిస్తున్నారు. అయితే గత నెల మా దిరిగా ఈ నెల కూడా వైద్యుడు లేకుండా వైద్య సిబ్బంది మాత్రమే గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. వైద్యుడు లేకుండా మీ రిచ్చే మందులను ఏ నమ్మకంతో వాడమంటారంటూ బాధితులు ప్రశ్నించారు. డాక్టర్ ఏమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యురాలు ట్రైనింగ్ నిమి త్తం ఏలూరు వెళ్లారని సిబ్బంది బదులిచ్చారు. అ యితే గత నెల ఎందుకు రాలేదని అడగ్గా, అప్పుడు డాక్టర్ వ్యక్తిగత సెలవు పెట్టారని సమాధానమిచ్చారు. డాక్టర్ లేకపోతే మరో రోజు రావచ్చుగా అ న్న ప్రశ్నకు.. మరో రోజు రావడం కుదరదని, డా క్టర్ పీహెచ్‌సీలో డ్యూటీ చేయాలి కదా అని సిబ్బంది సమాధానం ఇచ్చారు. డాక్టర్ వచ్చేనెల తప్పనిసరిగా వస్తారులే.. అయినా మేం మందులు ఇస్తున్నాంగా, గొడవ చేయకండి అని అన్నారు. డాక్టర్ సెలవు పెడితే మరో డాక్టర్‌ను పంపించాలి గాని, ఇలా సిబ్బందితో సేవలు అందించడం ఏంటని గ్రామస్తులు మండిపడ్డారు.