
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యలమంచిలి: లారీ ఢీకొని మోటార్‌సైక్లిస్టు మృతి చెందాడు. వివరాల ప్రకారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన మేడిచర్ల పూర్ణచంద్ర ఉదయభాస్కర్ (64) తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం చించినాడ వచ్చి తిరిగి బైక్‌పై వెళ్తుండగా చించినాడ వశిష్ట గోదావరి నది వంతెనపై సిమెంట్ లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భాస్కర్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య వివరించారు.
హత్య కేసులో 8 మంది అరెస్ట్
దెందులూరు: మండలంలోని వీరభద్రపురం వద్ద ఇటీవల జరిగిన హత్య కేసులో 8 మందిని పెదవేగి సీఐ రాజశేఖర్ అరెస్ట్ చేసినట్లు దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. 8 మంది నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపరచుగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు.
నాటుసారా కేంద్రాలపై దాడులు
కుక్కునూరు: మండలంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై సోమవారం జంగారెడ్డిగూడెం ఎకై ్సజ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సీతారామనగరం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకోని ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సీఐ కే శ్రీనుబాబు తెలిపారు. అంతేకాక మండలంలోని మారేడుబాక, శ్రీధరవేలేరు గ్రామాల్లో సారా వలన దుష్ఫలితాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గిరిజనుడి మృతి
వేలేరుపాడు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని గిరిజన యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామవరం గ్రామానికి చెందిన మడకం ప్రకాష్ మొహర్రం (పీర్లపండుగ)ను పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం కన్నాయిగుట్ట గ్రామానికి తన ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. వేలేరుపాడు మండల పరిధిలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా తలకు తీవ్ర గాయమైంది. వైద్యం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రకాష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేలేరుపాడు ఎస్సై నవీన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.