
పిడుగులతో అప్రమత్తం
వర్షాకాలంలో పిడుగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణాపాయంతో పాటు గృహోపకరణాలు కాలిపోయే ముప్పు ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 10లో u
వరదను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి
ఏలూరు(మెట్రో): గోదావరి వరదను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తు నియంత్రణ కార్యాచరణను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో గోదావరి వరద నియంత్రణ, సహాయక చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు, విద్యుత్, ఫైర్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల పేర్లు, అత్యవసర ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. కుక్కునూరు, వేలేరుపాడులో మొదటి, రెండవ, మూడో వరద ప్రమాద హెచ్చరికలకు అనుగుణంగా పునరావాస కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నెలలు నిండిన గర్బిణీల జాబితాను సిద్ధం చేసి సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
నాటుసారా రహిత జిల్లాగా ఏలూరు : జిల్లాలో 140 గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు పూర్తిగా అరికట్టినందున ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా కలెక్టర్ ప్రకటించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత పోస్టర్లను కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ప్రజల్లోకి టోల్ ఫ్రీ నెంబరు 14405పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
పింఛన్ల పంపిణీ పరిశీలన :
మంగళవారం ఏలూరులో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.జూలై 1న పింఛన్లు ఏదైనా కారణంతో తీసుకోని వారికి జూలై 2న పంపిణీ చేస్తామన్నారు.