వెబ్ కౌన్సెలింగ్‌పై గళమెత్తిన టీచర్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ పద్ధతిలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (ఫ్యాప్టో) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీల చట్టం–2025లో ఎస్‌జీటీల బదిలీలను మాన్యువల్‌గా చేపడతామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ హామీ ఇచ్చారని, అయితే ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా వెబ్ ఆప్షన్లను కొన్ని జిల్లాలకు విడుదల చేశారన్నారు. దీని ద్వారా కంప ల్సరీ బదిలీలో ఉన్న సుమారు 2,800 మంది ఐచ్ఛి కాలను ఎన్నుకోవాల్సి ఉందని, ఈ మేరకు వెబ్ కౌన్సెలింగ్‌ను ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వ్యతిరేకిస్తోందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో ఆదివారం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించా రు. ఫ్యాప్టో నాయకులు ఎం.శామ్యూల్, కేఆర్ పవన్‌కుమార్, సాంబశివరావు, వి.రామ్మోహన్‌రావు, ఆర్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముసునూరులో..
ముసునూరు: ఎస్‌జీటీల బదిలీలకు వెబ్ కౌన్సెలింగ్ ఆలోచన మానుకోవాలని మండల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. మండల ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం ఎదుట శనివారం సాయంత్రం నిరసన ధర్నా చేపట్టారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘ నేతలు గాంగేయుడు, బాబురావు, పద్మ కిషోర్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
నూజివీడులో..
నూజివీడు: ఎస్‌జీటీలకు మాన్యువల్‌గా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కా ర్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపా రు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారుల ఒంటె ద్దు పోకడలను వీడాలన్నారు. యూటీఎఫ్, ఎస్‌టీయూ, డీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
వెబ్ కౌన్సెలింగ్‌పై గళమెత్తిన టీచర్లు


