
ఖరీఫ్‌కు ఆదిలోనే ఆటంకం
గత 10 నుంచి 15 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఖరీఫ్ నారుమడి పనులకు ఆటంకంగా మారాయి. విత్తనాలు కొట్టుకుపో తున్నాయని రైతులు వాపోతున్నారు. 8లో u
పారిజాతగిరిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఆదివారం స్వామికి జరిగిన ధ్రువమూర్తి విశేషాభిషేకం, సాయంత్రం ద్వాదశ ఆరాధన, ద్వాదశ ప్రదక్షిణలు శ్రీ పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం నిత్య ఆరాధన అనంతరం స్వామివారి ధ్రువమూర్తికి పంచామృతాలతో, విశేష అభిషేక ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం కల్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని ప్రత్యేక వేదికపై అలంకరించి ద్వాదశరాధన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని తొళక్కం వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఉత్సవ కార్యక్రమం నిర్వహించిన రిత్విక్కులను సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు, సభ్యులు రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు, కంది బాలకృష్ణారెడ్డి, వాసవి సాయి నగేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.