ౖరెతులతో సర్కారు చెలగాటం | - | Sakshi
Sakshi News home page

ౖరెతులతో సర్కారు చెలగాటం

May 6 2025 1:18 AM | Updated on May 6 2025 1:26 AM

మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025

సాక్షి ప్రతినిధి,ఏలూరు: అకాల వర్షం అన్నదాతకు పుట్టెడు కష్టాలు తెచ్చిపెట్టింది. కల్లాల్లోని ధాన్యం తడిచిపోవడం, ఆయిల్‌పామ్‌, అరటి, బొప్పాయి, మామిడితో సహా పలు పంటలకు నష్టం వాటిల్లింది. ఆకస్మాత్తుగా ఆదివారం 4 గంటల పాటు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసి బెంబేలెత్తించింది. అధికారిక లెక్కలన్నీ వందల్లోనే ఉన్నా క్షేత్రస్థాయిలో వేల టన్నుల ధాన్యం తడిసిపోగా, వంద ల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

అనాలోచిత నిర్ణయాలతో..

జిల్లాలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ధా న్యం రైతు తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. రబీ సీజన్‌లో 77 వేల ఎకరాల సాగు విస్తీర్ణంలో 3.53 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ధాన్యం కొనుగోళ్లు మార్చి నెలాఖరు నాటికి ప్రారంభమై ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 50 శాతం ధాన్యమే కొనుగోలు చేస్తా మని చెప్పి 1.50 లక్షల టన్నులే కొంటామని ముందుగా ప్రకటించింది. రైతుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ లక్ష్యాన్ని 2 లక్షల టన్నులకు పెంచారు. చి వరగా 2.20 లక్షల టన్నులు కొంటామని, మిగిలిన పంట మిల్లర్లు, దళారులకు విక్రయించుకోవచ్చని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం 2.50 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు 2,14,900 టన్నుల ధాన్యం సేకరణ పూర్తయినట్టు అధికారులు ప్రకటించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చివరి గింజ వరకూ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి దళారీ వ్య వస్థకు అడ్డుకట్ట వేసి నేరుగా రైతులకే డబ్బులు జమచేశారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం దళారులకే అమ్ముకోండి అని ప్రత్యక్షంగానే చెబుతోంది.

రైతుల ఆందోళనలతో లక్ష్యాన్ని పెంచి..

గత వారంలో జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ ఇచ్చిన నివేదికల ప్రకారం కొనుగోలు లక్ష్యాన్ని నిర్దేశించామని అయినా ప్రభుత్వం ధాన్యం వ్యాపారం చేయడం లేదు కదా అని అన్నారు. వారం రోజులు గా ఏలూరు రూరల్‌, దెందులూరు, ఉంగుటూరు మండలాల్లోని రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు ఆందో ళనలు చేయడంతో లక్ష్యాన్ని ఎట్టకేలకు 2.50 లక్షల టన్నులకు పెంచారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రైతులు కల్లాల్లోనే ధాన్యం రాశులు పోసి ఉంచగా అకాల వర్షంతో పంట తడిసిపోయింది. భీమడోలు, చింతలపూడి మండలాల్లో ఎక్కువగా నష్టం జరిగింది. సుమారు 500 నుంచి 600 టన్నుల ధాన్యం తడిసినట్టు అంచనా. అలాగే అకాల వర్షానికి 148 ఆయిల్‌పామ్‌ మొక్కలు నేలకొరిగాయి. జీలుగుమిల్లి మండలం తాడువాయిలో సింహాద్రి శ్రీనివాస్‌ అనే రైతుకు చెందిన 3.30 ఎకరాల విస్తీర్ణంలో 48 ఆయిల్‌పామ్‌ మొక్కలు పూర్తిగా నేలకొరిగాయి. చింతలపూడి మండలంలో శెట్టివారిగూడెం, ప్రగడవరంలో తోటల్లోని మామిడి కాయలు నేలరాలాయి. బొప్పాయి, అరటి పంటలకు కూడా నష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి జిల్లాలో 2,781 ఎకరాల్లో వరి నేలకొరిగింది. అక్కడ కూడా మామిడి, బొప్పాయి, అరటి పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు.

న్యూస్‌రీల్‌

ధాన్యం.. వర్షార్పణం

అకాల వర్షాలతో రైతుల బెంబేలు

ధాన్యం కొనుగోళ్ల లక్ష్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

సర్కారు అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతల్లో ఆందోళన

రైతుల వద్దే 40 వేల టన్నుల నిల్వలు

అరటి, మామిడి, ఆయిల్‌పామ్‌, బొప్పాయి పంటలకూ దెబ్బ

ౖరెతులతో సర్కారు చెలగాటం 1
1/1

ౖరెతులతో సర్కారు చెలగాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement