
బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండ
ముసునూరు: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల వేళ బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. చెక్కపల్లిలో ఆదివారం గాలివాన ధాటికి చెట్టు విరిగి ఇంటిపై పడడంతో మృతి చెందిన బాలుడు మామిళ్ల బాలగోవింద్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చి ఆర్థిక సాయం అందించారు. పార్టీ మండల అధ్యక్షుడు మూల్పూరి నాగ వల్లేశ్వరరావు, జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, వైస్ ఎంపీపీ రాజానాయన, సొసైటీ మాజీ అధ్యక్షుడు కాటేపల్లి లింగారావు, నాయకులు కె.రమేష్, శ్రీనివాసరావు, సత్యం ఉన్నారు.