వ్యవసాయ అధికారులను అడ్డుకున్న రైతులు
టి.నరసాపురం: వ్యవసాయశాఖకు చెందిన విత్తనాభివృద్ధి క్షేత్రానికి కేటాయించిన భూమికి హద్దులు నిర్ణయించేందుకు వెళ్లిన అధికారులను అల్లంచర్ల రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం అల్లంచర్లలో విత్తనాభివృద్ధి క్షేత్రానికి 40 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఆ భూ మిలో కొంత భాగాన్ని రైతులు ఆక్రమించుకున్నా రు. భూమికి హద్దులు నిర్ణయించి వ్యవసాయ శాఖ కు చూపించేందుకు వ్యవసాయశాఖ జేడీఏ హబీబ్ బాషా, తహసీల్దార్ టి.సాయిబాబా, సర్వేయర్ అ క్కడికి వెళ్లారు. హద్దులు నిర్ణయించి కందకం తవ్వే ప్రయత్నం చేయడంతో ఆక్రమణలో ఉన్న రైతులు అడ్డుకున్నారు. విత్తనాభివృద్ధి క్షేత్రానికి భూమిని కేటాయించిన సమయంలోనే 82 మంది రైతులకు 50 సెంట్ల చొప్పున ప్రభుత్వం ప ట్టాలు ఇచ్చింది. అయితే వారికి భూమిని చూపించలేదు. తమకు భూములను చూపించాలని రైతులు పట్టుబట్టారు. తహసీల్దార్ నచ్చజెప్పే ప్రయత్నం చే సినా అంగీకరించలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు.


