ప్రభువు మార్గం అనుసరణీయం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏసుక్రీస్తు మార్గంలో ప్రతి క్రైస్తవుడూ పయనించిన నాడే శాంతి, స మాధానాలు లభిస్తాయని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు అన్నారు. స్థానిక గ్జేవియర్ నగర్‌లో ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్, నిర్మలగిరి పుణ్యక్షేత్ర అన్నదాన ట్రస్ట్ చైర్మన్ కళ్లే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సో మవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడు తూ పొరుగువారిని ప్రేమతో ఆదరించాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అ మలోద్భవి కథీడ్రల్ విచారణ గురువు ఫాదర్ ఇంజమాల మైఖేల్ మాట్లాడుతూ బిషప్ జయ రావు విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తొలుత కేక్ కట్ చేసి మహోత్సవాన్ని నిర్వహించారు. మేత్రాసనం ప్రొక్యూరేటర్ ఫా దర్ బి.రాజు, నిర్మలగిరి పుణ్యక్షేత్ర విచారణ గురువు జాన్ పీటర్, నాగేశ్వరరావు బిషప్ జయరావును గజమాలతో స న్మానించారు. కళ్లే లలిత ట్రస్ట్ చైర్మన్ భక్తుల సౌకర్యార్థం ఏసీ, రెండు వాటర్ రిఫ్రిజిరేటర్లను అందజేశారు.


