ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో దోహాదపడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యా యమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్ కుమార్ అ న్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు, సోష ల్ వర్కర్ల జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎం.సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో తెలుసుకున్న మెలకువలతో మరింత నైపుణ్యంతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన, చట్టపరమైన షరతులతో రాజీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగకుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, బార్ అసో సియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ పరీక్షలకు 22,356 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 22,356 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22,735 మంది రెగ్యులర్ విద్యార్థులకు 22,288 మంది హాజరయ్యారు. ఒకసారి ఫెయిలైన వారిలో 133 మందికి 68 మంది హాజరయ్యారు. జిల్లాలోని 64 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
దూరవిద్య పరీక్షలకు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న టెన్త్ తెలుగు పరీక్షకు 460 మంది విద్యార్థులకు 402 మంది హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు ఆరుగురికి ఆరుగురు హాజరయ్యారు. తొమ్మిది కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
భీమవరం: జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 98 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. 21,867 మంది విద్యార్థులకు 398 మంది గైర్హాజరయ్యారన్నారు. ఏపీఓఎస్‌ఎస్ తెలుగు పరీక్షకు 461 మందికి 368 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు.
నైపుణ్యంతో అపార అవకాశాలు
భీమడోలు: నైపుణ్యాలు గల యువతకు ఉద్యో గ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి రవి శ్యామ్ అన్నారు. భీమడోలు వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కల్పనా శాఖల సంయుక్త ఆ ధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 10వ తరగతి ఆపై చదివిని పలువురు నిరుద్యోగులు హాజరయ్యారు. డైకిన్, ముత్తూట్ ఫైనాన్స్, అరిజియో ఫైనాన్స్ కంపెనీల్లో 25 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. కళాశాల ప్రి న్సిపల్ బొమ్ము రవికుమార్, నైపుణ్యాభివృద్ది సంస్థ ప్రతినిధులు జే.రాము. ప్రవీణ్, కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ సెక్రటరీ అరెస్ట్
భీమవరం: భీమవరం మండలం చినఅమిరంలో నిధుల దుర్వినియోగం కేసులో పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన సాగిరాజు కిషోర్‌గోపాల్ కృష్ణంరాజును శుక్రవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఆర్‌జే జయసూర్య తెలిపారు. చినఅమిరం పంచాయతీలో సుమారు రూ.3.63 కోట్లు నిధులు దుర్వినియోగం కాగా అధికారుల ఫిర్యాదు మేరకు కృష్ణంరాజును అరెస్ట్ చేశామన్నారు. అతడిని భీమవరం రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించారన్నారు.
నిధుల గోల్‌మాల్‌పై విచారణ
పెనుగొండ: మండలంలోని ములపర్రు ప్రాథమిక సహకార సంఘంలో 2018లో రూ.90 లక్షలు గోల్‌మాల్ కాగా దీనిపై శుక్రవారం విచారణ చేపట్టారు. అప్పటి పాలకవర్గ సభ్యులను అప్పట్లో ప్రజలు, డిపాజిటర్లు, పాలకవర్గ సభ్యులు నిలదీయడంతో రూ.50 లక్షలు చెల్లించారు. మిగతా రూ.40 లక్షలు అప్పటినుంచి రికవరీ కాలేదు. దీంతో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎంఎం రెహమాన్ ములపర్రు సొసైటీలో విచారణ చేపట్టారు. విచారణలో వచ్చిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదించినట్టు ఆయన చెప్పారు.
మధ్యవర్తిత్వంతో సత్వర పరిష్కారం