దెందులూరు: ‘కొనుగోలు కేంద్రాలు ఎక్కడ’ అనే శీర్షికన ఈ నెల 16న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం దెందులూరు కోపరేటివ్ సొసైటీలో మార్క్‌ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో పెసలు, మినుములు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా మాట్లాడుతూ దెందులూరుతో పాటు పెదపాడు, వట్లూరు, జాలి పూడి డీసీఎంఎస్ సెంటర్లలో పెసలు మినుములు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏడీ సుబ్బారావు, తహసీల్దార్ బీ సుమతి, ఏవో దామా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మినుముల కొనుగోలు కేంద్రం ప్రారంభం