పోలీసుల దిగ్బంధంలో తణుకు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల దిగ్బంధంలో తణుకు

Mar 15 2025 1:49 AM | Updated on Mar 15 2025 1:48 AM

తణుకు అర్బన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనలో భాగంగా ఆంక్షలు, నిర్భంధాల మధ్య తణుకు పట్టణం వేడెక్కింది. శుక్రవారం పట్టణం పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. రాష్ట్రపతి రోడ్డు, పెరవలి రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు, సొసైటీ రోడ్డుల్లో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. నిరంతరం పోలీసు సైరన్‌లతో పట్టణ ప్రాంతం మార్మోగిపోయింది. తాడేపల్లిగూడెం, భీమవరం మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించి పారిశుద్ధ్య నిర్వహణ చేయిస్తున్నారు. గతంలో తణుకు ప్రాంతానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తణుకు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి హాజరైనప్పటికీ ప్రజలపై ఎలాంటి ఆంక్షలు, ఇబ్బందులు లేకుండానే పర్యటన నిర్వహించారు. నేడు ఇంత భద్రత, ఇన్ని రకాల ఆంక్షలు ఏంటనేది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి రోడ్డులో అడుగడుగునా పోలీసు అఽధికారులు, కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహిస్తుండగా పర్యవేక్షణకు ఉన్నతాధికారులు వాహనాల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు పర్యటన కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ఆదేశాలివ్వగా, దుకాణాలు మూసివేయాలని ఆంక్షలు విధించడం ఆశ్చర్యం కలిగిస్తుందని ప్రజలు చెబుతున్నారు.

సీఎం పర్యటనతో ఎన్నడూ లేని విధంగా భద్రత

పట్టణంలో అడుగడుగునా ఆంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement