
విస్సాకోడేరు గ్రామ సచివాలయం
కోళ్ల ఫారాల్లో బయో సెక్యూరిటీ
కోళ్ల ఫారాల్లో శానిటేషన్, బయో సెక్యూరిటీ విధానాలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారి కె.మురళీకృష్ణ చెప్పారు. 8లో u
గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తూ సచివాలయ వ్యవస్థను అమలులోకి తీసుకువచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వాటికి సొంత భవనాలను సమకూరుస్తోంది. జిల్లాలోని 296 పంచాయతీల పరిధిలో రూ.141.2 కోట్ల వ్యయంతో 353 చోట్ల పక్కా భవనాల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే 270 భవనాల పనులు పూర్తయ్యాయి. సచివాలయ భవనాల ప్రారంభోత్సవాలను పల్లెల్లో, పట్టణాల్లో అధికారులు ప్రజలతో మమేకమై పండగలా జరుపుకుంటూ సేవలను ప్రారంభిస్తోంది. కాగా, మిగిలిన సచివాలయ భవనాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బుధవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2024
సాక్షి, భీమవరం: స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు 2019 అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజున సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. గ్రామాల్లో రెండు వేలు, పట్టణాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపదికన జిల్లాలో 535 సచివాలయాలను ఏర్పాటు చేశారు. గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్, ఉద్యాన అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులను నియమించించడం ద్వారా జిల్లాలో ఐదు వేల మందికి పైగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 35 ప్రభుత్వ శాఖలకు చెందిన 500లకు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు.
ప్రత్యేక డిజైన్‌తో భవనాలు
గత ప్రభుత్వంలో పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ, బిల్ కలెక్టర్, అటెండర్ పేరిట ముగ్గురు, నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో లేక చాలా వరకు పనుల నిమిత్తం ప్రజలు వ్యయప్రయాసలకోర్చి మండల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 11 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులను సచివాలయాల్లో నియమించడం వల్ల అన్ని సేవలు సచివాలయాల్లో అందేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. ప్రజలు, ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కార్పొరేట్ కార్యాలయాల తరహాలో సచివాలయ భవనాలకు ప్రత్యేక డిజైన్ రూపొందించారు. ఒక్కో భవనానికి ప్రభుత్వం రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగుల కోసం కింద రెండు గదులు, ఒక హాల్, శానిటేషన్ సామగ్రి కోసం స్టోర్ రూమ్, మొదటి అంతస్తులో రెండు గదులు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా విశాలమైన హాల్‌తో డూప్లెక్స్ భవనాలు నిర్మిస్తోంది.
జిల్లాలో 353 చోట్ల..
జిల్లాలోని 253 పంచాయతీల పరిధిలో 353 సచివాలయ భవనాల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో నరసాపురం రెవెన్యూ డివిజన్‌లోని 114 పంచాయతీల్లో 136 భవనాలు, తాడేపల్లిగూడెం డివిజన్‌లోని 82 పంచాయతీల్లో 97, భీమవరం డివిజన్‌లోని 100 పంచాయతీల్లో 120 భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో నరసాపురం పరిధిలో 106, తాడేపల్లిగూడెంలో 77, భీమవరంలో 87 పూర్తి చేసి ఇప్పటికే పంచాయతీలకు అప్పగించగా ఆయా భవనాల్లో సచివాలయ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగిలిన వాటి నిర్మాణాలు కూడా త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు.
బొండాడపేట సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ ఉద్యోగులు
న్యూస్‌రీల్
జిల్లాలో గ్రామ సచివాలయాలకు సొంత భవనాలు
296 పంచాయతీల్లో 353 చోట్ల పక్కా కట్టడాలు
రూ.141.2 కోట్ల వ్యయంతో శరవేగంగా నిర్మాణం
సిబ్బంది, ప్రజలకు సౌకర్యవంతంగా భవనాల డిజైన్
ఒక్కో భవన నిర్మాణానికి రూ.40 లక్షల వరకు ఖర్చు
ఇప్పటికే 270 భవనాలు పంచాయతీలకు స్వాధీనం
నియోజకవర్గం పంచాయతీలు సచివాలయ మొత్తం విలువ పూర్తయినవి భవనాలు (రూ. కోట్లలో)
భీమవరం 34 38 15.2 32
ఆచంట 33 42 16.8 26
పాలకొల్లు 49 54 21.6 41
నరసాపురం 32 40 16 39
తాడేపల్లిగూడెం 42 47 18.8 38
తణుకు 40 50 20 39
ఉండి 50 62 24.8 40
గణపవరం (మం) 16 20 8 15



తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం గ్రామ సచివాలయం

సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్న అధికారులు