
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో ప్రతి విద్యార్థి చదవాలి, ఎదగాలి అన్న దూరదృష్టితో విద్యావ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువచ్చారు. నాడు–నేడు మన బడి పథకం అమలు ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా, నాణ్యమైన విద్య, అధునాత భవనాలు, మౌలిక వసతుల కల్పన చేశారు. దెందులూరు నియోజకవర్గం విద్యార్థిని ఐరాసలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేయడం ఎంతో సంతోషం. – కొఠారు అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్యే
అరుదైన గౌరవం
విశ్వవేదికలైన ఐక్యరాజ్యసమితి, కొలంబియా, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, అమెరికాలోని వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమాల్లో వట్లూరు ఉన్నత పాఠశాల విద్యార్థిని గాయత్రి పాల్గొనడం ఎంతో గర్వకారణం. ఏపీలోని విద్యావ్యవస్థల గురించి వివరించడం ప్రభుత్వ పాఠశాలల సిబ్బందికి దక్కిన అరుదైన గౌరవం. నాకు చాలా సంతోషంగా ఉంది.
– ఎస్.నర్సింహమూర్తి, ఎంఈఓ
●
