నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారి హుండీల ఆదాయాన్ని మొత్తం 56 రోజులకు సంబంధించి గురువారం లెక్కించారు. ఆలయ హుండీలో రూ.15,17,638, అన్నదాన ట్రస్ట్ హుండీలో రూ.34,452 కలిపి మొత్తం రూ.15,52,090 నగదు, 18.2 గ్రాముల బంగారం, 26 గ్రాముల వెండి, మూడు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ఈ వివరాలు తెలిపారు. తాడేపల్లిగూడెం తనిఖీదారు బీఎల్ నరసింహరావు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ప్రధానార్చకుడు అప్పారావుశర్మ తదితరులు పాల్గొన్నారు.
రూట్ మార్చిన టైగర్
గంగవరం: వారం రోజులుగా గంగవరం మండలంలో సంచరించిన పులి బుధవారం రాత్రి రంప చోడవరం మండలం ఫోక్స్‌పేట ఫారెస్టు రేంజ్ లోని ఊట్ల, ఎర్రంపాలెం అటవీ ప్రాంతానికి చేరు కుంది. డివిజనల్ అటవీ అధికారి శివకుమార్ గంగల్ ఆధ్వర్యాన ఫోక్స్‌పేట అటవీ ప్రాంతంలో గురువారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.


