వాగ్వాదం ముదిరి నిప్పంటించి..
తుని: ఇద్దరు మెకానిక్‌ల మధ్య జరిగిన తగాదాలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పాయకరావుపేట మండలం రామభద్రపురానికి చెందిన బైక్ మెకానికు రాజాకు, అదే మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన సైకిల్ మెకానిక్ నానాజీకి తుని రామా థియేటర్ ప్రాంతంలో పక్కపక్కనే షాపులు ఉన్నాయి. నానాజీ తరచూ రాజు దగ్గరకు వెళ్లి పనిముట్లు తెచ్చుకుని ఇవ్వడంలో అలసత్వం చూపేవాడు. ఈ క్రమంలో బుధవారం రెంచీల కోసం వెళ్లిన నానాజీతో రాజు వాగ్వాదానికి దిగాడు. వివాదం ముదిరి రాజు కోపంతో పక్కనే ఉన్న పెట్రోల్‌ను నానాజీపై పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన నానాజీని స్థానిక ఏరియా ఆస్పత్రికి పంపి అనంతరం మెరుగైన చికిత్సకు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఎస్సై విజయ్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జేఈఈ మెయిన్స్‌లో
శ్రీ షిర్డీసాయి హవా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జేఈఈ మెయిన్స్ ఫలితాలలో రాజమహేంద్రవరం శ్రీ షిర్డీ సాయి జునియర్ కాలేజ్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించినట్లు విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య బుధవారం తెలిపారు. తమ లక్ష్యా ఐఐటీ అకాడమిలో శిక్షణ పొందుతున్న ఎం.కృష్ణ శ్రీకృతి 99.91, కె.రామకార్తీక్ 99.71, ఎం.శ్రీనివాస్ 99.68, బి.శ్రీనిశాంత్ 99.63, కేవీయంకే.ప్రణీత్ 99.48, కె.సాత్విక్ 99.28, ఎ.లోహిత్ కుమార్ 99.23, బి.శ్రీనిహాంత్ 99.11 పర్సంటైల్ సాధించారన్నారు. మొత్తం 8 మంది 99 పైగా పర్సంటైల్ సాధించగా, 16 మంది 98 పైగా, 28 మంది 97 పైగా, 52 మంది 95 పైగా పర్సంటైల్ సాధించారన్నారు. శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ హాజరైన 284 మందిలో 184 మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారన్నారు. విజేతలను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, లక్ష్య డీన్ చంద్రశేఖర్ అభినందించారు.
శశి వేలివెన్ను ప్రభంజనం
నిడదవోలు: జేఈఈ మెయిన్–2026 ఫలితాలలో తమ విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలతో తమ సత్తా చాటారని వేలివెన్ను శశి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బూరుగుపల్లి రవికుమార్ తెలిపారు. ఈ ఫలితాల్లో కె.ప్రేమ్‌మార్‌రెడ్డి 99.93 పర్సంటైల్, కె.లోకేష్ శ్రీహర్ష 99.90 పర్సంటైల్‌తో పాటు 99 పర్సంటైల్ పైన 32 మంది సాధించారని తెలిపారు. ఒకే క్యాంపస్ నుంచి సుమారు 250 మందికి పైగా ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థ (నిట్, ఐఐటీ, ఐఐఐటీ) లలో సీట్లు సాధించగలరని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను అధ్యాపక బృందాన్ని శశి వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ అభినందించారు.
● పనిముట్ల విషయమై
మెకానిక్‌ల మధ్య తగాదా
● విచక్షణ కోల్పోయి ఒకరిపై మరొకరు పెట్రోలు పోసి నిప్పంటించిన వైనం
వాగ్వాదం ముదిరి నిప్పంటించి..
వాగ్వాదం ముదిరి నిప్పంటించి..
వాగ్వాదం ముదిరి నిప్పంటించి..


