రాజమహేంద్రవరంలో రెయిన్‌బో ఆసుపత్రి సేవలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రెయిన్‌బో ఆసుపత్రి సేవలు రాజమహేంద్రవరంలో అందుబాటులోకి వచ్చాయని ఆ ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల గురువారం తెలిపారు. స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులో ఆస్పత్రిని ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. ఉభయగోదావరి జిల్లా వాసులకు అధునాతన నియోనాటల్, పీడీయాట్రిక్ ఇన్సెంటివ్ కేర్, జనరల్ పీడియాట్రిక్, బర్త్ రైట్స్ ప్రసూతి, గైనకాలజీ, హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేర్, సంతానోత్పత్తి సంరక్షణ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన నర్సులు అధునాతన క్లినికల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆవిష్కరణతో రాజమహేంద్రవరం ఒక కీలకమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఉంటుందన్నారు. తమ సంస్థ 25 సంవత్సరాల వారసత్వ అనుభవంతో దేశంలో అతి పెద్ద నెట్‌వర్క్ కలిగి, తెలుగు రాష్ట్రాల ప్రజల విశ్వాసం చూరగొందన్నారు. గతంలో రెయిన్ బో ఆసుపత్రి సేవలు పొందాలంటే మెట్రో నగరాలకు వెళ్లవలసి వచ్చేదని, ఇప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరో ముఖ్య అతిథి తేజస్విని మతుకుమల్లి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఆసుపత్రి ప్రారంభించినందుకు రెయిన్ బో బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. అత్యున్నత నాణ్యతా చికిత్సలు ఈ ప్రాంత వాసులకు కల్పించడమే కాకుండా తల్లి, బిడ్డల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందన్నారు. డాక్టర్ దినేష్ చిర్లా, డాక్టర్ ప్రణతీరెడ్డి, నారా బ్రాహ్మణి పాల్గొన్నారు.


