జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ప్రతిభ
బాలాజీచెరువు: రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్ష ఫలితాల్లో కాకినాడ గంగరాజునగర్ ఆదిత్య హైస్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారు. షేక్ అబ్దుల్ షాహుల్ నవాజ్ (7వ తరగతి) ప్రథమ ర్యాంకు, ధైర్య సుమిత్ రామ (9వ తరగతి) ప్రథమ ర్యాంకును సాధించారు. జిల్లా స్థాయిలో అన్నమదేవర అభిరామ్ (6వ తరగతి) ప్రథమ, మోతూరి క్రిమ్సన్ (8వ తరగతి) రెండో ర్యాంకు, గుడివాడ వెంకట శివరామ అఖిలేష్ (9వ తరగతి) మొదటి ర్యాంకు, దంగేటి రోహిత్‌బాబు (10వ తరగతి) రెండో ర్యాంకును సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జె.మొయినా తెలిపారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, విజయానికి కారకులైన ఉపాధ్యాయులను ఆదిత్య సంస్థల ఛైర్మన్ ఎన్.శేషారెడ్డి అభినందించారు.
జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ప్రతిభ
జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ప్రతిభ
జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ప్రతిభ
జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ప్రతిభ
జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ప్రతిభ


