ఫొటోగ్రాఫర్ రాజ్‌కు జాతీయ స్థాయి బహుమతి
రాజమహేంద్రవరం సిటీ: గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే బ్లాక్ అండ్ వైట్ లైఫ్‌స్టైల్ ఫొటోగ్రాఫ్‌నకు రాజమహేంద్రవరానికి చెందిన ఫొటోగ్రాఫర్ రాజ్ జాతీయ స్థాయిలో రెండవ బహుమతి సాధించాడు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన హుస్సేన్ ఖాన్ (ఏఎఫ్‌ఐఏపీ) 8వ లంబాడా జాతీయ లైఫ్ స్టైల్ ఆర్ట్ ఫోటోగ్రఫీ పోటీలు ఈ నెల 13, 14, 15 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లెందు సమీపంలోని రూళ్లపాడులో జరిగాయి. ఈ పోటీలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. సహజమైన భావోద్వేగాలు, సంప్రదాయం, సాధారణ జీవిత క్షణాలను ఎంతో కళాత్మకంగా చిత్రీకరించిన విధానాన్ని జ్యూరీ ప్రత్యేకంగా గుర్తించి రెండో బహుమతికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా అవార్డును ప్రముఖ ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా రాజ్ అందుకున్నారు. బుధవారం నగరానికి వచ్చిన రాజ్ మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి గుర్తింపు తనకు మరింత ప్రేరణనిచ్చిందన్నారు.
ఫొటోగ్రాఫర్ రాజ్‌కు జాతీయ స్థాయి బహుమతి


