విద్యుత్ వైర్లు తగిలి కూలీ మృతి
రాజానగరం: మండలంలోని కానవరంలో పామాయిల్ గెలలు కోస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో అదే గ్రామానికి కూలీ బొర్రా నాగేశ్వరరావు (49) సోమవారం మృతి చెందాడు. సాయంత్రం 4 గంటల సమయంలో పొడవాటి ఇనుప గొట్టానికి బిగించి ఉన్న కత్తితో ఆయిల్ పామ్ చెట్ల నుంచి గెలలు కోస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మాజీ సర్పంచ్ ఎస్.సత్యనారాయణ మీడియాకు తెలిపారు. చెట్లపై నుంచి వెళ్లిన విద్యుత్ వైర్లు కత్తికి తగులుకొని విద్యుత్ ప్రవహించి, షాక్ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


