స్మార్ట్ ఇండియా హాకథాన్‌లో ప్రతిభ
గండేపల్లి: స్మార్డ్ ఇండియా హాకథాన్‌లో సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్టు చైర్మన్ పి కృష్ణారావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 8,9 తేదీలలో ముంబై వేస్కూల్‌లో ప్రతిష్టాత్మకగా జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 కార్యక్రమానికి తమ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు కె.సుచిత్ర, వి హేమంత్ శంకర్, వి మధు, బి ఆకాశ్, ఎస్ వేణు కౌశిక్, సాయి ప్రసాద్‌రాయ్ పాల్గొని మాగ్జిమైజింగ్ సెక్షన్ త్రూ ఫుట్ యూజింగ్ ఏ1–పవర్డ్ ప్రిసైజ్ ట్రైన్ ట్రాఫిక్ కంట్రోల్ అనే అంశంపై సవాల్‌తో కూడిన సమస్యను పరిష్కరించి జాతీయస్థాయిలో ఎంపికై న ఆరు జట్లలో ఒకటిగా ప్రగతి నిలిచిందన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎంవీ హరనాథబాబు, వైస్ ప్రెసిడెంట్ సతీష్, కె సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జి నరేష్, ఎంవీ రాజేష్, సీహెచ్ వీర గాయత్రి విద్యార్థులకు అభినందనలు తెలిపారు.


