ఉండాల్సిన వారు 27.. ఉన్నది 9 మంది
పెరవలి మండలంలోని కాకరపర్రు కెనాల్‌పై ఉన్న పెరవలి లాకు పరిధిలో 37,357 ఎకరాల సాగు భూమి ఉంది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని నిడదవోలు, ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఏడు మండలాల్లోని 51 గ్రామాలకు దీని ద్వారా సాగు, తాగునీరు అందుతోంది. పెరవలి లాకు పరిధిలో మొత్తం 27 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం ఒక ఏఈ, ఒక గుమస్తా(పర్మినెంట్ ఉద్యోగులు)తో పాటు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 9 మంది లస్కర్లు మాత్రమే ఉన్నారు. ఈ లాకుల పరిధిలోని ఉండ్రాజవరం, రామయ్యగుంట, అజ్జరం, భూపయ్య కాలువ, ఈస్ట్ విప్పర్రు, ఖండవల్లి, పేకేరు కాలువలపై ఏడుగురు డెల్టా లస్కర్లు ఉండాల్సి రాగా మొత్తం ఏడు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. అలాగే, కెనాల్ లస్కర్లు ఐదుగురు ఉండాలి. ఈ పోస్టులు కూడా మొత్తం ఖాళీ. వైరు లస్కర్లు ఇద్దరికి గాను ఒక్కరు మాత్రమే ఉన్నారు. వైర్ సూపరింటెండెంట్, లాకు లస్కర్లు 4, లాకు సూపరింటెండెంట్, గుమస్తాలు 2, వర్క్ ఇన్‌స్పెక్టర్లు 2, వాచ్‌మన్ 1, ఎవెన్యూ లస్కర్ 1 చొప్పున పోస్టులుండగా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వీరందరి విధులను కేవలం 9 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోనే కానిచ్చేస్తున్నారు.


