రెండు మోటారు సైకిళ్ల చోరీ
సామర్లకోట: రెండు మోటారు సైకిళ్ల చోరీపై ఆదివారం బాధితులు సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక పెద్దబజార్‌కు చెందిన శ్రీశైలపు బుజ్జి శనివారం స్టేషన్ సెంటర్‌లోని ఆటో స్టాండ్ వద్ద తన మోటార్ సైకిల్ నిలిపి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి కనిపించ లేదని ఫిర్యాదు చేశాడు. అదే విధంగా జి.మేడపాడు గ్రామానికి చెందిన మాదాసు వెంకటరమణ రైల్వే గేటు వద్ద నిలిపిన మోటార్ సైకిల్ చోరీకి గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శిలాఫలకం ధ్వంసం
చేశారని ఫిర్యాదు
ముమ్మిడివరం: గత ప్రభుత్వంలో రహదారి నిర్మాణ నిమిత్తం ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని స్థానిక జనసేన నాయకుడు ధ్వంసం చేశారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని గేదెల్లంక ఉత్తరవాహినికి వెళ్లే రహదారి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనివార్య కారణాలతో రోడ్డు నిర్మాణ పనులు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ రోడ్డు నిర్మాణానికి రూ.1.86 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ పనులు మొదలు పెట్టే ఉద్దేశంలో కనీసం గ్రామ సర్పంచ్‌కు గాని, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలికి గాని సమాచారం ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని జేసీబీతో స్థానిక జనసేన నాయకుడు గుద్దటి రమాకేశవ బాలకృష్ణ ధ్వంసం చేశారని అంటున్నారు. అదేవిధంగా పంచాయతీ తీర్మానం లేకుండా అడ్డు వచ్చిన కొబ్బరి చెట్లను తొలగించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ సానబోయిన పల్లయ్య, వైఎస్సార్ సీపీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జంపన శ్రీనివాసరాజు, కోలా వెంకటరత్నం (బాబ్జీ) తదితరులు ఆదివారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


