చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి
కొత్తపేట: స్థానిక మద్దులమెరక గ్రామానికి చెందిన చుట్టుగుళ్ల ఏడుకొండలు (64) అనే కల్లుగీత కార్మికుడు ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుకొండలు చెట్ల నుంచి కల్లు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దానిలో భాగంగా శనివారం గ్రామంలోని తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


