రాజీయే రాజమార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీ పడడమే రాజమార్గమని, ప్రతీ ఒక్కరూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జాతీయ లోక్ అదాలత్ శనివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌కు 46 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులు, ఎకై ్సజ్ విభాగానికి చెందిన డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించామన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. గత మూడు జాతీయ లోక్ అదాలత్‌లలో 10,700 కేసులు పరిష్కరించి రూ.100.99 కోట్ల ్టపరిహారం చెల్లించామన్నారు. నాలుగో జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి జిల్లా పరిధిలో రాత్రి 9 గంటల వరకు 16,873 కేసులు పరిష్కరించగా రూ.27.32 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎంమాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రిశాస్త్రి పాల్గొన్నారు.


