ఏపీ ఎన్‌జీవో జిల్లా కార్యవర్గం
అమలాపురం టౌన్: ఏపీ ఎన్‌జీవో సంఘం కోనసీమ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక ఏవీఆర్ నగర్‌లోని జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. కార్యవర్గంలోని 17 పోస్టులకు సంబంధించి ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా బి.సత్యనారాయణరెడ్డి వ్యవహరించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా ఎం.వెంకటేశ్వర్లు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎన్.రామారావు, కార్యదర్శిగా కోలా పీవీఎన్‌బీ కృష్ణ, ఉపాధ్యక్షులుగా జె.మల్లికార్జునుడు, సీహెచ్ చిట్టిబాబు, సీహెచ్ సూర్యారావు, టి.ఏసుబాబు, ఆర్‌వీ నరసింహరాజు, మహిళా ఉపాధ్యక్షురాలిగా కె.లోవలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా ఎంవీ సీతారామరాజు, బి.రామకృష్ణ, జి.వెంకటేశ్వరరావు, ఎస్‌వీ రామారావు, డి.పృథ్వీరాజ్, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎస్. కృష్ణవేణి, కోశాధికారిగా జి.సురేష్‌సింగ్ ఎన్నికయ్యారు. ఎన్నికలకు అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా పి.రమేష్, అబ్జర్వర్‌గా టి.జానకి వ్యవహరించారు. కార్యవర్గాన్ని ఉమ్మడి జిల్లా సంఘం పూర్వ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు.


