చోరీ సొత్తు రికవరీ
తుని: రైల్వే ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి రైల్వే పోలీసులు చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తుని జీఆర్పీ సబ్ ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. తుని రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై అనుమానిత వ్యక్తులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అతడు రైళ్లలో చోరీలు చేస్తున్నట్టు తెలిపింది. అతడి నుంచి రూ.52 వేలు, సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు.


