సీలింగ్ భూములు పంచాలని ధర్నా
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజానగరం మండలంలోని జి.యర్రపాలెం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 330/4లో4.43 సెంట్ల భూమిని సీలింగ్, ప్రభుత్వ బంజరు భూములను పంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ధ ధర్నా నిర్వహించారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏ భూమీ లేని నిరుపేదలకు ఈ భూమిని పంచాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేటులకు కారుచౌకగా భూములను పంచిపెడుతోందన్నారు. వేల ఎకరాలను ఎకరానికి కేవలం 90 పైసలకు దోచిపెడుతున్న చంద్రబాబు పేదలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రవికుమార్, సత్యనారాయణ, రైతు కూలీ సంఘ నాయకులు పాల్గొన్నారు.
హాస్టల్‌లో మౌలిక సదుపాయాల కోసం...
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద గల బాలుర వసతి గృహం–1లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ సోమవారం కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో వార్డెన్, కుక్, కమాటి, వాచ్‌మన్, హెల్పర్స్‌ని నియమించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిందని, కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఏర్పాటు చేయలేదన్నారు.


