● సంధ్యా సమయం.. ఆధ్యాత్మిక సోయగం
సాయం సంధ్యా సమయాన.. ఆ వేంకటేశుని క్షేత్రాన కనువిందు చేసే దృశ్య కావ్యం ఆవిష్కృతమైంది.. అందరినీ మంత్రముగ్ధులను చేసింది.. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం వద్ద సోమవారం సాయంత్రం సూర్యుడు అస్తమించే వేళలో ఆకాశం కొత్త అందాన్ని సంతరించుకుంది. సూర్యుడి చుట్టూ స్వర్ణ ఛాయ, అందులో వెంకన్న క్షేత్ర రాజగోపురం ఆకట్టుకుంది. దీనిని పలువురు భక్తులు తమ కెమెరాల్లో బంధించారు. –కొత్తపేట


